ఇంటి పేరుతోనే ‘సింధియా’ ఎదిగారు: పీకే

by Ramesh Goud |   ( Updated:2020-03-12 01:21:29.0  )
ఇంటి పేరుతోనే ‘సింధియా’ ఎదిగారు: పీకే
X

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. గాంధీ ఇంటిపేరు కారణంగా కాంగ్రెస్‌ను విమర్శించేవారు .. ‘‘సింధియా కాంగ్రెస్ పార్టీ వీడటాన్ని ఆ పార్టీకి తీవ్ర నష్టమని ఎలా భావిస్తారు? అసలు సింధియా కూడా తన ఇంటి పేరుతోనే మాస్ లీడర్‌గా ఎదిగారు’ అంటూ పీకే ట్వీట్ చేశారు. కాగా, జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. దీంతో ఎంపీలోని కమల్‌నాథ్ సర్కార్ తీవ్ర సంక్షోభంలో పడింది.

tag; mp political turmoil, pk comment, Jyotiraditya Scindia

Advertisement

Next Story

Most Viewed