- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెలివరీ బాయ్‌కు పాజిటివ్.. 72 కుటుంబాలు క్వారంటైన్‌లోకి..!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి ఎలా సోకుతుందో ఊహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా చాలా మందిని కలిసేవారిలో ఈ వైరస్ పాజిటివ్ సోకినట్టు ఇప్పుడు తెలిసినా.. ఎంతమందికి ఆ మహమ్మారి పాకిందో అన్న ఆందోళనలు వెల్లడవుతున్నాయి. ఇటువంటి రీతిలోనే ఢిల్లీలో ఓ కేసు నమోదైంది. ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతను డెలివరీ చేసిన కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి. ఆ బాయ్ డ్యూటీలో ఉన్నప్పుడు డెలివరీ చేసిన 72 కుటుంబాలను అధికారులు హోం క్వారంటైన్‌లోకి పంపారు. అంతేకాదు, కనీసం 20 మంది సహడెలివరీ ఏజెంట్‌లనూ నిర్బంధంలోకి తరలించారు. ఆ బాయ్‌కు కూడా అతను డెలివరీ చేసిన ఓ కుటుంబం నుంచి కరోనా సోకి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సౌత్ ఢిల్లీలో 19 ఏళ్ల పిజ్జా డెలివరీ బాయ్.. ఏప్రిల్ 12వ తేదీ వరకు డ్యూటీ చేశాడు. అతనికి కరోనా పాజిటివ్ తేలడంతో.. ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.
Tags: coronavirus, delhi, delivery boy, quarantine, agent, pizza