ఫుట్‌బాల్ మ్యాచ్‌కు పిచ్ ఇన్వాడర్‌ల ఆటంకాలు

by Shyam |   ( Updated:2021-06-22 09:52:06.0  )
ఫుట్‌బాల్ మ్యాచ్‌కు పిచ్ ఇన్వాడర్‌ల ఆటంకాలు
X

దిశ, స్పోర్ట్స్: ఆట జరుగుతుండగా మైదానం మధ్యలోకి వచ్చి హంగామా సృష్టించే వాళ్లను పిచ్ ఇన్వాడర్స్ అంటారు. యూరో కప్ 2020లో వీళ్ల వలన మ్యాచ్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ పీస్ ప్రతినిధి ఒకరు పారాచ్యూట్ ద్వారా గ్రౌండ్‌లోకి దిగి గందరగోళం సృష్టించిన విషయం మర్చిపోకముందే మరో యువతి మైదానంలో పరుగెత్తింది. యూరో 2020లో భాగంగా బెల్జియం, ఫిన్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక యువతి ‘డబ్ల్యూటీఎఫ్ కాయిన్’ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి పరుగెత్తుకుంటూ వచ్చింది.

వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్ సెక్యూరిటీ ఆమెను అక్కడి నుంచి బయటకు పట్టుకొని వెళ్లారు. డబ్ల్యూటీఎఫ్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఇటీవల ఆ కరెన్సీకి ఆదరణ తగ్గిపోవడంతో బిట్ కాయన్ ఎక్చేంజీలలో నమోదు కావడం లేదు. అయితే ఈ కరెన్సీకి ప్రచారం కల్పించే ఉద్దేశంతోనే అలా పిచ్ ఇన్వాడింగ్‌ను వాడుకున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఇలా పిచ్ ఇన్వాడింగ్‌కు పాల్పడితే తొలి సారి 50 వేల డాలర్లు జరిమానా విధిస్తారు. రెండో సారి 1 లక్ష డాలర్లు, మూడో సారి 2.5 లక్షల డాలర్ల జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా జీవితాంతం వారికి మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయడంపై నిషేధం కూడా ఉంటుంది.

Advertisement

Next Story