- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఆదాయం రూ. 3,302 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ నికర లాభం రూ. 628.31 కోట్లతో 13.95 శాతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. ఫార్మా విభాగంలో బలమైన అమ్మకాల నేపథ్యంలో లాభాలను ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 551.37 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 3,301.84 కోట్లుగా ఉందని, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,270.50 కోట్లుగా నమోదైనట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ..ప్రస్తుత ఏడాది తొలి సగంలో మెరుగైన పనితీరును అందించాం. బ్యాలెన్స్ షీట్ బలోపేతం చేయడంపై దృష్టి సారించామని, గతేడాదిలో రూ. 18 వేల కోట్ల మూలధనాన్ని సాధించినట్టు కంపెనీ తెలిపింది. పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ 1.3 శాతం తగ్గి రూ. 1,282.05 వద్ద ముగిసింది.