‘మాటలు మర్యాదగా రానివ్వు కౌశిక్ రెడ్డి.. లేకపోతే నాలుక కోస్తాం’

by Sridhar Babu |
pinapaka Congress leaders
X

దిశ, మణుగూరు: టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ‘మాటలు మర్యాదగా రానివ్వు’ అని పాడి కౌశిక్ రెడ్డికి పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చందా సంతోష్ కుమార్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో పెరిగి, టీఆర్ఎస్‌కు అమ్ముడుబోయి రేవంత్ రెడ్డిపై ‘మర్యాద లేకుండా మాట్లాడితే నాలుకకోస్తాం’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం పినపాక నియోజకవర్గ కేంద్రంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేశారు. కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళలు చెప్పులతో కొట్టి హెచ్చరికలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా చందా సంతోష్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి, అతని బండారం ఎక్కడ బయటపడుతుందో అని రేవంత్ రెడ్డిపై మాట్లడిన మాటలు సరైనవి కావన్నారు. డబ్బులు పంచి టీపీసీసీ పదవి కొన్నారని మాట్లాడిన మాటలు మరోసారి వినపడితే నాలుక కోస్తాం అని హెచ్చరించారు.

టీఆర్ఎస్ పార్టీ కొమ్ముకాస్తూ.. కాంగ్రెస్ పార్టీని దూషిస్తే సహించేది లేదన్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కో-కన్వీనర్ గురజాల గోపి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నవీన్, సుధాకర్ రెడ్డి, నాయకులు సాంబశివరావు, రాములు, శబన, సౌజన్య, రజిని, నాగమణి, యువజన నాయకులు సాగర్, వేణు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed