- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఆస్పత్రిలో పందుల సంచారం
దిశ, వెబ్ డెస్క్: కరోనా ఆస్పత్రిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఒకటి, రెండు అనుకుంటే మన తప్పే.. దాదాపుగా 50 మేర పందులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కల్బుర్గి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాటి పని అవి చేసుకుంటుండగా డాక్టర్లతో పాటు మిగిలిన సిబ్బంది కూడా పందులను చూసి చూడనట్లు వదిలేయడం గమనార్హం. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పందులు స్వైర విహారం చేస్తున్నా ఆస్పత్రి సిబ్బందికి రోగుల పట్ల గానీ, శుభ్రత పట్ల ఏ మాత్రం బాధ్యత లేనట్లు కనిపిస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా దేశంలో మరణ మృదంగం మోగిస్తుంటే.. పందుల వలన కొత్త రోగాలు రావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క సీన్‌తో కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఏ విధంగా స్పష్టంగా కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉంటే కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 60వేలకు చేరుతోంది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా కరోనా బారినపడి మృతిచెందారు.