- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 817 కోట్లు పలికిన పికాసో పెయింటింగ్స్!
దిశ, ఫీచర్స్ : ఆధునిక చిత్రకళ చరిత్రను మలుపు తిప్పిన ఘనుడు పాబ్లో పికాసో. ప్రపంచం గర్వించదగ్గ చిత్రకారుడిగా పేరొందిన పికాసో బహుముఖ ప్రజ్ఞశాలి. ఆ మహానుభావుడు గీసిన చిత్రాలు ఎప్పటికీ అజరామరం. స్పెయిన్‌లోని మలగా పట్టణంలో 1881 అక్టోబర్ 25న పుట్టిన ఆయన.. 1973లో 91 ఏళ్ల వయసులో మరణించారు. ఆ కళాకారుడి 140వ జయంతి సందర్భంగా ప్రముఖ అక్షన్ హౌజ్ సోథెబీ లాస్ వెగాస్‌లోని బెల్లాజియో హోటల్‌లో వేలం నిర్వహించించగా.. ఆయన గీసిన 11 కళాకృతులు 109 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించాయి.
సోథెబీ నిర్వహించిన వేలంలో 1917 నుంచి 1969 వరకు పికాసో గీసిన కళాకృతులను ప్రదర్శించింది. రెండు దశాబ్దాలుగా ఓ హోటల్‌లో ప్రదర్శనకు ఉన్న 11 పెయింటింగ్స్‌లో, 1938లో వేసిన ‘ఉమెన్ ఇన్ ఏ రెడ్-ఆరెంజ్’ చిత్రం 40.5 మిలియన్ డాలర్ల ధర పలికింది. కాగా ఈ పెయింటింగ్ 30 మిలియన్ డాలర్ల వరకు ధర పలుకుతుందని నిర్వహాకులు అంచనా వేయగా.. ఊహించని రీతిలో అధిక ధరకు అమ్ముడుపోయింది. కాగా పెయింటింగ్ చివరిసారిగా 1980లలో దాదాపు 900,000 డాలర్లకు వేలంలో విక్రయించబడింది. ఆ తర్వాత 1998లో క్యాసినో మొగల్ స్టీవ్ వైన్ దీన్ని కొనుగోలు చేయగా, చివరగా ఎంజీఎమ్ రిసార్ట్స్ ఆస్తిగా ఉండిపోయింది.
ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పికాసో వేసిన రెండు క్యూబిస్ట్-ప్రేరేపిత స్టిల్ లైఫ్ పెయింటింగ్‌లు కూడా వేలంలో ఉన్నాయి. ఇందులో ‘నేచర్ మోర్టే పానీయర్ డి ఫ్రూట్స్ ఎట్ ఆక్స్ ఫ్లూర్స్’ $16.6 మిలియన్‌కు అమ్ముడుపోగా.. ‘నేచర్ మోర్టే ఆక్స్ ఫ్లూర్స్ ఎట్ ఓ కంపోటీయర్’ $83 మిలియన్ ధర పలికింది. ఇక మిగిలినవి 24.4 మిలియన్ డాలర్లు, 9.5 మిలియన్ డాలర్లు, 2.1 మిలియన్ డాలర్లకు సేల్ అయ్యాయి. మొత్తంగా 11 పెయింటిగ్స్‌కు $ 109 మిలియన్ (దాదాపు. రూ. 8,17,63,18,900) ధర పలికాయి.