ముందుగా గుర్తిస్తే.. తొందరగా బయటపడొచ్చు

by  |
ముందుగా గుర్తిస్తే.. తొందరగా బయటపడొచ్చు
X

దిశ, కోదాడ: కోదాడ మండల పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి అన్నారు. గురువారం ఆయన మండంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావొద్దని, వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని తెలిపారు.

వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించి గ్రామంలో, ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, వాసన రాకపోవడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్య కార్యకర్తల వద్ద తమ పేరు నమోదు చేసుకొని కరోనా పరీక్షలు చేసుకోవాలని కోరారు. కరోనా వ్యాధిని ముందుగానే గుర్తించడంతో వెంటనే వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలిసిన వారి వివరాలు ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడూ నమోదు చేసి వారికి జాగ్రత్తలు వివరించాలని, మందులు అందజేయాలని ఆరోగ్య అధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed