చంద్రబాబు, పవన్‌కు మరో షాక్.. ఈసీకి కంప్లైంట్ చేసిన వైసీపీ

by Satheesh |
చంద్రబాబు, పవన్‌కు మరో షాక్.. ఈసీకి కంప్లైంట్ చేసిన వైసీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కీలకమైన నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా ప్రచారంపై ఫోకస్ పెట్టారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఓ పక్క గెలిస్తే తాము ఏం చేస్తామో చెబుతూనే.. మరోపక్క ప్రత్యర్థిపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాజకీయ నేతల విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయం సమ్మర్ హీట్‌ను తలపిస్తోంది.

ఈ క్రమంలోనే అధికార వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై అధికార పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించేలా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ ఈసీ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, గతంలోనే జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు చంద్రబాబు, పవన్‌లకు నోటీసులు జారీ చేసిన.. తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story