ఆర్థిక ఇబ్బందులు.. ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య

by Sumithra |
ఆర్థిక ఇబ్బందులు.. ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య
X

దిశ, హుజూర్‌నగర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పీర్లకొట్టం బజారులో నివాసం ఉంటున్న భానుప్రకాశ్(27) ఫొటో‌గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికితోడు కరోనా, లాక్‌డౌన్ కావడంతో ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. కుటుంబ పోషణ కూడా కష్టతరం అయింది. ఈ క్రమంలోనే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భానుప్రకాశ్ ఉరివేసుకున్నాడు.

Advertisement

Next Story