- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కటే.. మెసేజ్‌లు, ఫోన్ కాల్స్.. విసుగెత్తిన గ్రాడ్యుయేట్ ఓటర్లు
దిశ, తెలంగాణ బ్యూరో : ఓటర్ల సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం గోప్యంగా ఉంచాలి. ఓటర్ల జాబితాను మాత్రమే ఇవ్వాలి. అందులో ఉండే పేరు, సీరియల్ నెంబర్, పోలింగ్ బూత్ లాంటి వివరాలు మాత్రమే ఎన్నికల సంఘం వెల్లడించాలి. కానీ అందుకు భిన్నంగా అభ్యర్థులు ప్రచారానికి సంబంధించి ఓటర్లందరికీ మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్‌లు రావడం, వారి తరఫున టెలీ కాలర్‌లు ఫోన్ చేయడం లాంటివి తరచూ వస్తుండడం చికాకుగా మారింది.
కుప్పలు తెప్పలుగా..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో ఓటర్లకు కుప్పలు తెప్పలుగా ఓటర్లకు ప్రచార మెసేజ్‌లు వచ్చి పడుతున్నాయి. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో వారందరి నుంచి రోజూ వరుస మెసేజ్‌లు వస్తున్నాయి. ఓట్లర్లు రకరకాల పనుల్లో ఉన్నప్పుడు వస్తున్న మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వారిని విసుగెత్తిస్తున్నాయి.
నెంబర్లు తెలిసిందెలా?
‘మీ సేవ’, ఇంటర్నెట్ సెంటర్లలో, ‘ఆన్‌లైన్’లో పట్టభద్రులు వారి పేర్లను నమోదు చేసుకునేటప్పుడు పట్టభద్రులైనట్లుగా ధ్రువీకరించే సర్టిఫికెట్లతో పాటు ఫోన్ నెంబర్‌ను జతచేశారు. ఆ వివరాల ప్రకారం బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫసర్) వెరిఫికేషన్ చేసిన తర్వాత జాబితాలో పేరు నమోదవుతోంది. ఇప్పుడు అభ్యర్థుల చేతికి అందిన వివరాలు బీఎల్ఓ నుంచి అందాయా? లేక ‘మీ సేవ’ కేంద్రాల నుంచి సేకరించారా? లేక ఎన్నికల సంఘం నుంచే లీక్ అయ్యాయా? వంటి సందేహాలున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఆ వివరాలు తమ కార్యాలయం నుంచి లీక్ కాలేదని వివరణ ఇస్తున్నారు. చాలా చోట్ల పార్టీల అభ్యర్థులు, స్థానిక కార్యకర్తలే పోటీపడి ఓటర్లుగా పేర్లను నమోదు చేయించారు. ఇలాంటి సమయంలోనే మొబైల్ నెంబర్లు ఆయా పార్టీల చేతులకు చేరుకున్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.
డిజిటల్ ప్రచారంలో ప్రభుత్వ నిర్ణయాలు?
ప్రభుత్వం చేపట్టబోయే పనుల వివరాలను అధికార పార్టీ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వమే ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోనప్పుడు ఓటర్లకు దాన్ని ఏ ప్రాతిపదికన లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకే ఇలాంటి హామీలను గుప్పిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ప్రభుత్వ ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్, పదవీ విరమణ వయస్సు పెంపు, త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల లాంటి అంశాలను మెసేజ్‌లలో పేర్కొనడం వివాదాస్పదమైంది. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే ఇలాంటి హామీలు గుప్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ తీరుపై ప్రతిపక్షలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.