రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

by Shyam |   ( Updated:2020-10-23 09:53:04.0  )
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
X

దిశ, పటాన్‌చెరు:
రోడ్డు ప్రమాదంలో పీహెచ్‌డీ విద్యార్థి మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…. సింగరేణి కుంట భువనగిరికి చెందిన రావుల సంపత్(29) మండలంలోని గీతం విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ మూడో సంవత్సరం విద్యను అభ్యసిస్తూ రుద్రారం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో తన స్నేహితుడు అజయ్ కుమార్ తో కలిసి ఇస్నాపూర్ లో భోజనం చేసేందుకు బైక్ పై వెళ్ళాడు. భోజనం ముగించుకొని రాత్రి 11 గంటల సమయంలో రుద్రారం గ్రామానికి తిరిగి బయలు దేరాడు. గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టాడు. దీంతో రాహుల సంపత్ తలకు బలమైన గాయాలు తగిలి ఆక్కడికక్కడే మృతి చెందాడు. కాగా స్వల్ప గాయాలతో అజయ్ కుమార్ బయటపడ్డాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఫిర్యాదు మేరకు ఎస్.ఐ సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed