పోలీసులకు మాస్కుల అందజేత

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి తెలంగాణ ఫార్మా అండ్ కెమికల్స్ అసోసియేషన్(టాప్సీ) కృతజ్ఞతలు తెలిపింది. వారికి ఎంతో కొంత రక్షణగా ఉంటుందని మాస్కులు, శానిటైజర్లు అందజేస్తున్నట్టు అసోషియేషన్ ప్రతినిధులు తెలిపారు. శనివారం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు 5 వేల మాస్కులు, వెయ్యి లీటర్ల శానిటైజర్, వెయ్యి శానిటైజర్ బాటిళ్లను అందజేశారు. డీజీపీని కలిసిన టాప్సీ ప్రతినిధులలో ఎన్. వి నరేందర్, ఎన్. మల్లారెడ్డి, పి.వి రావు, వి.సి.ఎస్ రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed