- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియాకు ఫైజర్ బెస్ట్ ఆఫర్
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ భారత్‌కు బెస్ట్ ఆఫర్ ఇచ్చింది. ఇండియాలో టీకా పంపిణీ కోసం తాము లాభార్జన ఆశించని ధరకే టీకాలు అందిస్తామని వెల్లడించింది. ప్రపంచంవ్యాప్తంగా టీకా పొందడంలోనూ సమానత్వాన్ని సాధించడానికి, అందరికీ టీకాను చేరువ చేయాలనే తమ లక్ష్యంలో భాగంగా ధనిక, మధ్యాదాయ, పేద దేశాలకు అనుగుణంగా రేట్లపై నిర్ణయం తీసుకుంటున్నామని వివరించింది. భారత్‌లోనూ ప్రజలకు టీకా చేరువ చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మహమ్మారి కాలం ముగిసే వరకూ సామాన్యులకు టీకాను అందించాలని భావిస్తూ తాము కేవలం ప్రభుత్వాలకే టీకాలను అందించాలని యోచిస్తున్నట్టు తెలిపింది. అందుకే తాము లాభాన్ని ఆశించని ధరకే భారత్‌కు టీకా అందించాలని భావిస్తున్నట్టు ఫైజర్ ప్రతినిధి ఒకరు పీటీఐకి తెలిపారు.
అమెరికన్ టీకాలకు భారత్‌లో అధికంగా చెల్లించాల్సి వస్తుందన్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. అందులో సత్యం లేదని తెలిపారు. అయితే, ఇక్కడ వారి టీకాలను విక్రయించే ధరను వెల్లడించకున్నప్పటికీ, తాము లాభాన్ని ఆశించకుండానే ఇక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్ టీకా డోసుకు అమెరికాలో 19.5 యూఎస్ డాలర్లు, యూరోపియన్ యూనియన్‌లో 15.5 యూరోలు చార్జ్ చేస్తున్నది. -78 డిగ్రీల సెల్సియస్ సెంటిగ్రేడ్‌ల దగ్గర నిల్వ చేసే ఫైజర్ టీకా 95శాతం కరోనాను నిలువరించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు ఫలితాలు వెల్లడించాయి.
భారత్‌లో టీకా పంపిణీ కోసం ఫైజర్ గతేడాదే రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది. కానీ, సరైన వివరాల్లేవని రెగ్యులేటరీ పెండింగ్‌లో ఉంచింది. ఫిబ్రవరిలో ఈ దరఖాస్తును సంస్థ వెనక్కి తీసుకుంది. తాజాగా, భారత్ విదేశీ టీకాల ఆమోదానికి నిబంధనలు సడలించడంతో మళ్లీ దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు అత్యవసర వినియోగ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.