నేడు, రేపు పీజీసెట్‌ వెబ్‌ ఆప్షన్లు

by Shyam |   ( Updated:2020-12-06 23:55:50.0  )
నేడు, రేపు పీజీసెట్‌ వెబ్‌ ఆప్షన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో వెబ్‌ ఆప్షన్లు ఉండనున్నాయి. ఈ మేరకు పీజీఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ పి.రమేశ్‌ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన సీట్ల కేటాయించనున్నట్లు వివరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కన్వీనర్‌ కోటా కింద 2020-21 సంవత్సరానికి రాష్ట్రంలో 8,040 సీట్లు అందుబాటులో ఉన్నాయని రమేష్ బాబు వెల్లడించారు.

Advertisement

Next Story