కరోనా సోకిన నర్సులకు పీజీ వైద్యుల వేధింపులు

by Shyam |
కరోనా సోకిన నర్సులకు పీజీ వైద్యుల వేధింపులు
X

దిశ , వరంగల్: విధినిర్వహణలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఇద్దరు స్టాఫ్ నర్సుల పట్ల పీజీ వైద్యులు కర్కషంగా వ్యవహరించారు. సాటి వైద్య సిబ్బంది అని చూడకుండా అవమాన పరిచారు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎంలో చోటుచేసుకోగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..ఎంజీఎం ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి కరోనా సోకింది. దీంతో వారిని కరోనా వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.అయితే వీరిని వేరే గదిలోకి వెళ్లాలని పీజీ వైద్యులు వేధింపులకు గురి చేస్తున్నారు. తాము చికిత్స పొందుతున్నందున వేరే రూమ్‌లోకి వెళ్లబోమని నర్సులు మొండికేసారు. అయితే పీజీ వైద్యులు తమ అనుసరిస్తున్న తీరును సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన వైద్యులనే వెనకేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి బారిన పడి దినదిన గండంలా జీవిస్తున్న తమకు ఓదార్పునివ్వాల్సిన వైద్యులు, అధికారులు తమతో వ్యవహరిస్తున్నతీరును తట్టుకోలేకపోతున్నామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఆవేదనను వీడియోలో సందేశం ద్వారా ఉన్నతాధికారులకు పంపించారు.ఈ విషయం వెలుగులోకి రావడంతో ఎంజీఎం పీజీ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed