డెల్టా వేరియంట్‌పై ఫైజర్ ప్రభావం స్వల్పమే

by Shamantha N |
Pfizer
X

న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన టీకా భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌పై ఒరిజిన్ స్ట్రెయిన్‌పై కంటే తక్కువ ప్రభావమే వేస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. ఒరిజిన్ స్ట్రెయిన్‌పై కంటే డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ఐదు రెట్లు స్వల్పంగా యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తున్నదని వివరించింది. కేవలం ఒకే డోసు తీసుకున్నవారిలో లేదా రెండు డోసులను ఎక్కువ వ్యవధి తేడాతో తీసుకున్నవారిలో టీకా ప్రభావం తక్కువగానే ఉన్నదని లాన్సెట్ స్టడీ వెల్లడించింది. తమ అధ్యయనంలో రెండో డోసు పంపిణీ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవద్దని తెలిసివచ్చిందని, అలాగే, రెండు డోసులనూ వైరస్ స్ట్రెయిన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం కొరవడటంతో బూస్టర్ డోస్ అనివార్యమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తు్న్నదని ప్రముఖ సైంటిస్టు ఎమ్మా వాల్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed