- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైజర్ వ్యాక్సిన్‌కు WHO గ్రీన్ సిగ్నల్..
జెనీవా : ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అనుమతినిచ్చింది. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన సేఫ్టీ, సామర్థ్య ప్రమాణాలను ఫైజర్ టీకా కలిగి ఉన్నదని సంస్థ వెల్లడించింది. అత్యవసర వినియోగ అనుమతితో పేద దేశాల్లో టీకా దిగుమతికి రెగ్యులేటరీల ఆమోదం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపింది. ప్రతి దేశం ఒక డ్రగ్ రెగ్యులేటరీ కలిగి ఉంటుంది.
టీకా వినియోగానికి డ్రగ్ రెగ్యులేటరీలు ప్రత్యేక నిబంధనలతో అనుమతినిస్తుంటాయి. కానీ, బలహీన వ్యవస్థలున్న దేశాలు డబ్ల్యూహెచ్‌వో అనుమతులపై ఆధారపడుతుంటాయి. కాబట్టి తాజా అనుమతులతో పేద దేశాలూ టీకా దిగుమతి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కసరత్తు ప్రారంభిస్తాయని తెలుస్తున్నది. ఫైజర్ టీకాను అత్యల్ప ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంది. పేద దేశాల్లో ఫ్రీజింగ్ వ్యవస్థ, విద్యుత్‌లాంటి మౌలిక వసతుల కొరత కారణంగా ఈ టీకా పెనుసవాళ్లను విసరనుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.