మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు!

by Harish |
మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొంత విరామం తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆరు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలను బుధవారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న కారణంగానే దేశీయంగా ధరలు పెంపునకు కారణమని విక్రయ సంస్థలు వెల్లడించాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ. 84.45తో కొత్త గరిష్ఠాలను తాకాయి. డీజిల్ లీటర్‌కు రూ. 74.63కి చేరుకుంది.

దేశీయంగా ఇతర ప్రాంతాల్లో చమురు ధరలను పరిశీలిస్తే…వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ లీటర్ రూ. 91.07 ఉండగా, డీజిల్ లీటరుకు రూ. 81.34గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ అత్యధికంగా ఉండగా, డీజిల్ ముంబైలో రికార్డు స్థాయిలో ఉంది. చెన్నైల్‌లో పెట్రోల్ రూ. 87.18, డీజిల్ రూ. 79.95గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ. 87.85 ఉండగా, డీజిల్ ధర రూ. 81.45గా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.3 శాతం పెరిగి 53.88 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూ ఆయిల్ ధర 57.37 డాలర్లకు పెరిగింది. కాగా, ఇటీవల చమురు ఉత్పత్తిలో స్వచ్ఛందంగా కోత నిర్ణయాన్ని సౌదీ ప్రకటించింది. అందువల్లే చమురు ధరలపై ప్రభావం ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed