ప్రయాణికులకు షాక్.. రూ.100 దాటిన పెట్రోల్

by Harish |
ప్రయాణికులకు షాక్.. రూ.100 దాటిన పెట్రోల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి మూలంగా అతలాకుతలం అవుతున్న దేశ ప్రజలకు మరో బిగ్ షాక్ తగిలింది. గతకొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తాజాగా శనివారం దేశంలోని పలు నగరాల్లో రూ.100 దాటింది. కొత్తగా పెట్రోల్‌ 27 పైసల వరకు పెరుగగా, డీజిల్‌ 30పైసల వరకు పెరిగింది. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.90.74కు చేరింది. రూ.81.12కు ఎగసింది. ముఖ్యంగా రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102 దాటగా, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెటోల్ ధర దాదాపు వందకు చేరువగా ఉంది.

ఇక తెలగాణలోని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.86 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.11 ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.68 ఉంది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.02 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.24 ఉంది. ఖమ్మంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.92 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.14 ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.96.78కు చేరింది. డీజిల్‌ ధర 21 పైసలు పెరుగుదలతో రూ.90.39కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.97.04కు చేరింది. డీజిల్ ధర 22 పైసలు పెరుగుదలతో రూ.90.65కు ఎగసింది.

Advertisement

Next Story

Most Viewed