- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్రోల్ బంక్ మోసం.. డీజిల్ పోయించుకుంటే..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు సంబంధించిన పెట్రోల్ బంక్ లో కల్తీ డీజిల్ విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ వాహనదారులు ఆందోళనకు దిగారు. శనివారం బంక్ లో ఇంధనం నింపుకొని వాహనాలు మొరాయిస్తున్నాయని, డీజిల్ డబ్బాలలో నింపి చూపుతూ నిరసనకు దిగారు. నాసిరకమైన డీజిల్ తీసుకువచ్చి విక్రయించడం వల్ల వాహనాలు చెడి పోతున్నాయని వాహనదారులు ఆరోపించారు. పెట్రోల్ బంక్ లో డీజిల్ పోస్తే చిక్కగా ఉండకుండా రంగు తేడాగా ఉంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ బంక్ వద్ద పదుల సంఖ్యలో వాహనదారులు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. డీజిల్ ట్యాంక్ నుండి డీజిల్ పోస్తే నీళ్లు ఇతర రసాయనాలు కలిపి వస్తున్నాయన్నారు.
ఈ విషయమై యజమానిని వివరణ అడిగే ప్రయత్నం చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. కల్తీ డీజిల్ విక్రయించడం వల్ల తమ వాహనాలు చెడిపోతున్నాయని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా సమాధానం ఇవ్వడం లేదని తగిలేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశం ఆరోపించారు. ఇండియన్ ఆయిల్ బంక్ లో డీజిల్ పోసుకోవడం వల్ల తన రెండు ఆటోలు చెడిపోయి వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని వెంకటేశం తెలపారు. తనతో పాటు మరో పది వాహనాలు కూడా చెడిపోయి గ్యారేజీలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రతినిత్యం ఇండియన్ ఆయిల్ బంక్ లో డీజిల్ పోసుకోవడం వల్ల పదుల సంఖ్యలో ఆటోలు ట్రాక్టర్లు చెడిపోయాయని, వెంటనే బంకు యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని బంకును సీజ్ చేయాలని బాధితుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కల్తీ డీజిల్ విక్రయిస్తున్న బంకు యజమానిపై చర్యలు తీసుకొని బంకును సీజ్ చేయాలని లేకపోతే బంకు నడవనియమని బాధితులు హెచ్చరించారు.