మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

by Harish |   ( Updated:2021-06-25 22:20:18.0  )
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.31 ఉండగా.. డీజిల్ రూ.98.38గా ఉంది. గుంటూరులో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రూ. 107.77గా ఉంది. అటు విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.11 ఉండగా.. డీజిల్ ధర రూ.98.18గా ఉంది. లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర రూ.107.57గా ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.101.96, డీజిల్ ధర రూ. 96.63గా ఉంది.

Advertisement

Next Story