పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైం రికార్ట్

by srinivas |
petrol
X

దిశ, వెబ్‌డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు అమాంతం పెరిగిపోతున్నాయి. గడిచిన 8 రోజులుగా వీటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. మంగళవారం సైతం పెట్రోల్ 31 పైసలు, డీజిల్ 38 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.92.84కు, డీజిల్ ధర రూ.86.93కు చేరాయి. ఏపీలో పెట్రోల్ ధర 30 పైసలు పెరగడంతో లీటర్ రూ.95.19లకు, డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ.88.77లకు చేరింది.

ఢిల్లీలో పెట్రోల్ ధర 30 పైసలు పెరుగుదలతో రూ.89.29కు చేరింది. డీజిల్ 35 పైసలు పెరిగి.. రూ.79.70కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 38 పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర రూ.95.75, రూ.86.72కు ఎగసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటేసింది. వీటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో రూ.100 మార్క్‌ను పెట్రోల్ దాటేసింది.

Advertisement

Next Story