బీసీసీఐకి షాక్.. ‘ఐపీఎల్ నిర్వహించొద్దు’

by Shiva |
బీసీసీఐకి షాక్.. ‘ఐపీఎల్ నిర్వహించొద్దు’
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ipl) యూఏఈకి తరలి వెళ్లిన విషయం తెలిసిందే. మరో నెల రోజుల్లో ఈ మెగా లీగ్ ప్రారంభం కానుండగా బీసీసీఐ (bcci)కి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ (ipl) 2020 యూఏఈలో జరగకుండా నిలిపివేయాలని కోరుతూ న్యాయవాది అభిషేక్ లాగో బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

‘ఐపీఎల్ అనేది చారిటీ ఈవెంట్ కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ (country’s economy)కు ఇది ఎంతో ఉపయోగకరమైనది. గత సీజన్ ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 475 మిలియన్ డాలర్లుగా ఉంది. ఐపీఎల్ తరలి వెళ్లిపోవడం వల్ల దేశం రెవెన్యూ పరంగా మరింత నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ లీగ్ ఇండియాలోనే నిర్వహించేలా బీసీసీఐ (bcci) కి ఆదేశాలు ఇవ్వండి’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దీపాంకత్ దత్తా, జస్టిస్ రేవతి మోహిత్ డేరా ముందుకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed