నిజామాబాద్ టు భద్రాచలం.. గోదావరి ఒడ్డున పురుగుల మందు తాగి..!

by Anukaran |
నిజామాబాద్ టు భద్రాచలం.. గోదావరి ఒడ్డున పురుగుల మందు తాగి..!
X

దిశ, భద్రాచలం అర్బన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గోదావరి ఒడ్డున ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో భద్రాచలం కానిస్టేబుల్ బాబు స్థానికుల సాయంతో అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సూసైడ్‌కు ప్రయత్నించిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఆర్య నగర్‌కు చెందిన మన్మోహన్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆ యువకుడు అపస్మారక స్థితిలో ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. అయితే, ప్రేమ వ్యవహారం వల్లే యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story