- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ టు తిరుపతి ట్రైన్‌లో దారుణం..
దిశ, కామారెడ్డి : నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలు నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా కింద పడిపోయాడు. సంబంధిత బాధితునికి 108 సిబ్బంది సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన జిల్లాలోని బిక్కనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు నుండి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన సంపంగి కుమార్ అనే వ్యక్తి అనుకోకుండా కింద పడిపోయాడు.
దీంతో అతని తలకు బలమైన గాయమై, కాలు విరిగి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అది గమనించిన కొందరు వెంటనే 108కు ఫోన్ చేశారు. సకాలంలో చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన కుమార్‌కు ప్రాథమిక చికిత్స చేసి, కిలోమీటర్ దూరం వరకు అతన్ని స్ట్రేచర్ పైన అంబులెన్స్ వరకు తీసుకొని వచ్చి హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిర్వహించిన వారిలో 108 సిబ్బంది ఈఎంటీ సురేష్, పైలట్ సుదర్శన్ గౌడ్ ఉన్నారు.