- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెతో వివాహేతర సంబంధం.. బిడ్డపై అఘాయిత్యం
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఎన్నిచట్టాలు తెచ్చినా కొందరికి భయం లేకుండా పోతోంది. అవి కఠినంగా అమలు కాకపోవడంతోనే ఈ విధంగా దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఆమె కూతురుపైనే ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. స్థానికంగా నివసించే హసీనా(పేరు మార్చాం)కు 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయి గత పదేళ్లుగా ఆమె పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే శంకర్ అనే వ్యక్తి ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరు తరుచుగా కలుసుకుంటుండేవారు. ఇదే అదనుగా భావించిన శంకర్ ఆమె ఇంటికి వచ్చి నేరుగా ఆ మహిళతో శృంగారం చేసేవాడు. పిల్లలు చూస్తున్నరన్న స్పృహ లేకుండా ఇద్దరూ ఏంజాయ్ చేసేవారు. హసీనా పెద్ద కుమార్తె అంజుమ్(పేరు మార్పు)పై శంకర్ కన్నేశాడు. ఎలాగైనా, ఆ యువతితో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.
గత వారం యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శంకర్ వచ్చాడు. యువతిపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. వరుసగా అలా వారంరోజుల పాటు అత్యాచారం చేయసాగాడు.దీంతో యువతి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరింది. దీంతో తల్లికి అసలు విషయం తెలియగా, ఆమె శంకర్‌ను నిలదీసింది. అతను ఇష్టారీతిన వ్యహరించడంతో ఆమె మిన్నకుండిపోయింది. బాధిత యువతి తన స్నేహితుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపగా, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.