విశాఖలోని ఓ అపార్ట్‌మెంటులో దారుణం..

by srinivas |   ( Updated:2021-07-06 02:03:20.0  )
vizag-beach
X

దిశ, వెబ్‌డెస్క్ :ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. బీచ్ రోడ్డులోని ఓ అపార్టుమెంటులో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారడంతో పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. అయితే, వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో గోపాలకృష్ణ అనే యువకుడిని బ్రహ్మాజీ అనే తోటి స్నేహితుడు కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇతనిది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం గ్రామం. మృతుడు విశాఖలోని ఓ కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed