బావిలో ‘చెల్లి’ శవమై కనిపించడంతో ‘భార్య’ను చంపి.. ఆఖరుకు తాను కూడా ‘పాయిజన్’..!

by Anukaran |   ( Updated:2021-11-19 11:51:15.0  )
బావిలో ‘చెల్లి’ శవమై కనిపించడంతో ‘భార్య’ను చంపి.. ఆఖరుకు తాను కూడా ‘పాయిజన్’..!
X

దిశ, వెబ్ డెస్క్ : బావిలో చెల్లెలి శవాన్ని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన అన్న నేరుగా భార్య దగ్గరకు వెళ్లి ఆమెను హతమార్చాడు. అనంతరం అతను కూడా పాయిజన్ తాగి ఆత్మహత్యకు యత్నించగా చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె నగరంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సమీర్ భివాజీ తవారే (35) సోదరి మాయా సోపన్ సతవ్ (32) బుధవారం తన ఇంట్లో కనిపించకుండా పోయింది. ఆమె కోసం సోదరుడు ఎక్కడెక్కడో వెతికాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.

తీరా చూస్తే గురువారం ఉదయం ఆమె మృతదేహం బావిలో కనిపించింది. ఆ బావి మాండ్‌వగన్ ఫరాటా (షిరూర్ తాలూకా) వద్ద ఉంది. తన ప్రియమైన సోదరి ఆత్మహత్య చేసుకోవడాన్ని భరించలేక పోయిన సమీర్.. నేరుగా ఇంటికి వెళ్లి భార్య వైశాలి తవారే(28)పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత సమీర్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన ఇరుగుపొరుగు అతన్ని వెంటనే దౌండ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, స్థానికుల ఫిర్యాదు మేరకు పూణె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story