కారు టైరు పేలి..ఘోర రోడ్డు ప్రమాదం

by Shyam |
కారు టైరు పేలి..ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన ఎడపల్లి మండలంలోని సాటపూర్​ గేట్​ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముగ్గురు వ్యక్తులు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తుండగా సాటపూర్ గేట్ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మృతుడు, బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story