ఒకే అబద్ధం చెబుతూ 11 ఏండ్లుగా ‘సెక్స్’.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

by Sumithra |   ( Updated:2021-07-27 02:55:11.0  )
sex-and-marriage
X

దిశ, వెబ్‌డెస్క్ : అవి చదువుకునే రోజులు. వారిద్దరూ అనుకోకుండా పరిచయం అయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. చదువును అడ్డం పెట్టుకుని రోజు కలుసుకునే వారు. ఇద్దరి మధ్య చనువు కూడా పెరిగింది. ఇంకేముంది కట్ చేస్తే.. గురుడు రూం అద్దెకు తీసుకుని చదువుకుందాం రా అని పిలిచాడు. నమ్మి వెళ్లిన యువతిని ప్రేమ, పెళ్లిపేరుతో నమ్మించి లోబర్చుకున్నాడు. 2009లో ప్రారంభమైన ఈ ప్రేమ 11ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ప్రేమ, పెళ్లి, సెక్స్ ఇవన్నీ వారి జీవితంలో కామన్ అయ్యాయి. ఓ రోజు యువతి ధైర్యం చేయడంతో వీరి సుదీర్ఘ ప్రేమ, పెళ్లికి బ్రేక్ పడింది. అది ఎలానో ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని అశోక చోళాలోని టెంపుల్ ఏరియాలో ఉండే 22 ఏళ్ల అమ్మాయికి నివాడీలో నివసించే ప్రవీణ్ పటేరియా పరిచయం అయ్యాడు. అమ్మాయి కోచింగ్ తీసుకుంటుండగా.. ప్రవీణ్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య చనువు మరింత పెరగ్గా 2009 డిసెంబర్ 10న అశోక గార్డెన్‌లో రూం తీసుకున్న ప్రవీణ్ ఆమెను ప్రేమ, పెళ్లిపేరుతో నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత మరో ఏడేండ్లు ప్రేమ, పెళ్లి ముచ్చట్లు, సెక్స్ వీరి మధ్య కామన్ అయ్యాయి. తీరా 2016లో మకాం మార్చిన ప్రవీణ్ భోపాల్‌లో మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. విషయం తెలియడంతో తనను పెళ్లి చేసుకోమంటూ అమ్మాయి కూడా అతని వద్దకు వెళ్లింది. అక్కడకు వెళ్లాక కూడా సేమ్ సీన్ రిపీట్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్లీ లోబర్చుకున్నాడు.

ఇలా వీరిద్దరు పెళ్లి విషయంపై చర్చిస్తుండగానే 11 ఏళ్లు గడిచాయి. ప్రతిసారీ ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నా బాధితురాలు అతను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో వెంట తిరుగుతూ వచ్చింది. తీరా ఓ రోజు పెళ్లి చేసుకుంటావా లేదా గట్టిగా నిలదీయడంతో గుడిలో పెళ్లిచేసుకుందామని చెప్పాడు ప్రవీణ్. సరిగ్గా మూడ్రోజుల కిందట బంధువులతో సహా అమ్మాయి అక్కడకు వెళ్లగా పెళ్లి చేసుకోకుండా తప్పించుకునేందుకు యత్నించాడు.

చివరగా బంధువులు పట్టుకుని గట్టిగా నిలదీయడంతో అతను చెప్పిన మాటలు విని అందరికీ నోట మాట రాలేదు. ‘తనకు ఇది వరకే వేరే అమ్మాయితో పెళ్లి అయ్యిందని’ చెప్పడంతో బాధితురాలు తాను మోసపోయాయని భావించి కంటతడిపెట్టుకుంది. ఇలాంటి వ్యక్తి కోసం ఇన్నేళ్లు ఎందుకు వెయిట్ చేశానని కుమిలిపోయిన బాధితురాలు చివరగా ప్రవీణ్ పై రేప్ కేసు పెట్టింది. కాగా, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఫోన్ లో పోర్న్ చూస్తున్నారు.. ఫైన్ కట్టాలని పోలీస్ నోటీసులు.. ట్విస్ట్ ఏంటంటే..?

For more viral news : https://www.facebook.com/TeluguViralnew

Advertisement

Next Story