- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
దిశ, అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి పేర్ని నాని మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లో ఉన్న ప్రచార విభాగంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు:
• ఉగాది నాటికి సుమారు 26 లక్షల ఇళ్ల స్ధలాల పంపిణీ
• ఎన్పీఆర్ ప్రక్రియను అలయెన్స్‌లో ఉంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర
• పీపీపీ విధానంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి
• రామాయపట్నం పోర్టు ఏర్పాటు
• రుణం తీసుకునేందుకు సీడ్ కార్పొరేషన్‌కు అనుమతి
• కాకినాడ సమీపంలో తొండంగి మండలం కోన గ్రామం వద్ద పోర్టు నిర్మాణం కోసం 9 నెలల కాలవ్యవధిని పొడిగిస్తూ .. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌కు అనుమతి
• కాకినాడ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్‌లో 49 శాతం ఈక్విటీని అదానీ పోర్టు అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌కు బదిలీ చేస్తూ ఒప్పందం
• కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సున్నిపెంటలో 4 గ్రామ సచివాలయాల ఏర్పాటు, అందులో 44 పోస్టుల భర్తీ
• ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 1.96 ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేస్తూ జారీ చేసిన జీవోకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరిగి ఆ భూమిని వాటర్ రీసోర్స్ డెవలప్‌మెంట్ డిపార్ట్ మెంట్‌కు కేటాయించి, ఎన్‌ఎస్‌పి కాలనీ విస్తరణకు వినియోగం
• రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్, భూ అక్రమాలపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదికలోని అంశాలపై విచారణ అధికారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయ తీసుకుంది.
•
tag: ap cabinet, jagan, minister perni nani, amaravathi