లోకేశ్‌కు ఎన్టీఆర్ భయం పట్టుకుంది : పేర్నినాని

by srinivas |   ( Updated:2021-06-21 10:48:45.0  )
perni nani lokesh ntr
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై వైసీపీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్ర్తాలు సంధించారు. లోకేశ్‌కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనీ ఎక్కడ హస్తగతం చేసుకొంటాడోనని లోకేశ్ ఆందోళనల చెందుతున్నారన్నారు. అంతేకాకుండా లోకేశ్‌ను ఉద్దేశిస్తూ.. గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్ కాలేడని,… బూతులు మాట్లాడితే సీఎం కాలేడన్నారు. జూ.ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే.. లోకేశ్ మళ్లీ ఉద్యోగం వెతుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story