సైబీరియన్ గుహలో 28 వేల ఏళ్లనాటి సింహం పిల్ల

by Shyam |
సైబీరియన్ గుహలో 28 వేల ఏళ్లనాటి సింహం పిల్ల
X

దిశ, ఫీచర్స్ : సైబీరియాలోని ఒక గుహ లోపల ఫ్రోజెన్(గడ్డకట్టిన) రూపంలో సంరక్షించబడిన సింహం పిల్ల దొరికింది. ఈ ఫిమేల్ కబ్ దాదాపు 28వేల సంవత్సరాల కిందట చనిపోయి ఉండవచ్చని నిపుణులు వెల్లడించారు. జీవ అవశేషాలపై చేపట్టిన అధ్యయనాలు పరిశీలిస్తే.. ఇప్పటివరకు కనుగొన్న మంచు యుగపు జంతువుల్లో ఉత్తమంగా సంరక్షించబడిన వాటిలో ఇది కూడా ఒకటని తేలింది.

సెంటర్ ఫర్ పాలియోజెనెటిక్స్, స్టాక్‌హామ్, స్వీడన్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ సింహం పిల్లకు ‘స్పార్టా’ అనే నిక్ నేమ్ పెట్టారు. కాగా ఈ గుహలో లభించిన సింహం పళ్లు, చర్మం చెక్కుచెదరలేదు. అంతేకాదు దాని కణజాలం, అవయవాలు మమ్మిఫైడ్(శవాలు భద్రపరుచుట) చేసినప్పటికీ కుళ్లిపోకపోవడం విశేషం. అనూహ్యంగా దాని బొచ్చు కూడా మట్టితో కప్పబడి ఉంది. ఇక అది చనిపోయేనాటికి రెండు నెలల వయసుందని ఎక్స్‌పర్ట్స్ వెల్లడించారు. గుహలో దీనికి 49 అడుగుల దూరంలో మరో సింహం పిల్ల కూడా దొరకగా, ఇవి రెండు సిబ్లింగ్స్ అయి ఉంటాయని నిర్ధారించారు. అయితే కొత్త అధ్యయనం ప్రకారం మరో కబ్(బోరిస్) చనిపోయిన 15 వేల ఏళ్లకు స్పార్టా చనిపోయిందని, అంటే దీనికంటే బోరిస్ వయసులో పెద్దదని రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా కనుగొన్నారు. 2017, 2018 మధ్య తూర్పు సైబీరియాలో కనుగొనబడ్డ ఈ సింహం పిల్లలు వేటగాడి దాడిలో చనిపోయినట్టు తేలింది.

‘అవి సంరక్షించబడిన తీరు చూస్తే చాలా త్వరగా ఖననం చేసి ఉండాలి. కాబట్టి అవి బురదలో చనిపోయి ఉండవచ్చు లేదా మంచులోని పగుళ్లలో పడి ఉండి, కాలానుగుణంగా గడ్డకట్టవచ్చు. స్పార్టా ఇప్పటివరకు కనుగొనబడిన వాటిలో అత్యుత్తమంగా సంరక్షించబడిన మంచు యుగపు జంతువు. దాని బొచ్చు ఇప్పటికీ దెబ్బతినకుండా ఉంది. బోరిస్ బాడీ కొంచెం డ్యామేజ్ అయినా బాగానే ఉంది’ అని సెంటర్ ఫర్ పాలియోజెనెటిక్స్‌లో పరిణామ జన్యుశాస్త్ర ప్రొఫెసర్ లవ్ డాలెన్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed