- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కేంద్రాన్ని చుట్టుముట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకే!
దిశ, భద్రాచలం: భద్రాచలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద తోపులాట జరిగింది. గురువారం వ్యాక్సిన్ వేయడం కోసం బుధవారం నాడే టోకెన్లు తీసుకోవాలని వ్యాక్సినేషన్ ఇన్‌చార్జి చెప్పడంతో భారీగా జనం తరలివచ్చారు. ఉదయం ఏడు గంటలకే జనం చేరుకున్నారు. ఒక్కరోజు 200 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని అధికారులు చెప్పడంతో అధికంగా వచ్చిన ప్రజలు టోకెన్‌ల కోసం ఎగబడ్డారు. అయినా సంబంధిత అధికారి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. క్యూ లేకపోవడంతో మహిళలు, పురుషులు తోసుకున్నారు.
ఇదిలా ఉంటే వైద్య సిబ్బంది కొన్ని టోకెన్లు తమ బంధుమిత్రుల కోసం దాచుకొని పేరుకి మరికొన్ని టోకెన్లు మాత్రమే పంపిణీ చేసినట్లు అక్కడికి వచ్చిన ప్రజలు బహిరంగ ఆరోపణ చేశారు. టోకెన్లు ఇచ్చేచోట తోపులాట లేకుండా అందరు క్యూ పద్ధతి పాటించేలా ఇక ముందైనా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం అన్నివిధాల మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది చూస్తుంటే థియేటర్ల వద్ద టికెట్స్ కోసం ఎగబడుతున్నట్లు ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.