సడన్ లాక్‌డౌన్‌తో సామాన్యుల ఇక్కట్లు…

by Shyam |
సడన్ లాక్‌డౌన్‌తో సామాన్యుల ఇక్కట్లు…
X

దిశ, మిర్యాలగూడ: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సడన్ లాక్‌డౌన్ పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. ప్రభుత్వ ప్రకటన తెలియని కొందరు వలసలు, పెళ్లిండ్ల నిర్వాహకులు నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు దుకాణాలు తెరుస్తారని తెల్లవారు జామునే దుకాణాలవద్దకు చేరుకున్నారు. పెళ్లి సామాగ్రి కోసం హంగు ఆర్బాటం లేకుండా పరిమిత సంఖ్యలో వచ్చి వస్తువులు, సరుకులు కొనుగోలు చేశారు. ఆర్టీసీ బస్సులు నడుస్తాయన్న ప్రకటనతో పలువురు బస్టాండ్లలో గంటలపాటు కూర్చున్నా ఒక్క బస్సు రాలేదు. విచారణ సిబ్బంది అందుబాటులో లేక ప్రయాణికులు వెనుదిరిగి పోయారు. ఆటోలు సైతం నడవక పలువురు బంధుమిత్రుల ఇళ్లకు కాలినడకన చేరుకున్నారు.

పోలీసుల ముమ్మర తనిఖీలు…

10గంటల తర్వాత వర్తక వ్యాపార సముదాయాలన్ని మూత పడ్డాయి. 10గంటల తర్వాత రోడ్ల మీదకు వచ్చిన వారిని పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. పట్టణంలోని రాజీవ్ చౌక్, రాఘవ థియేటర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రించారు. గుర్తింపు కార్డులు కలిగిన వారిని వదిలి మిగతా వారికి కరోనా నిబంధనలపై అవగాహన కల్పించి హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed