డమ్మీ గన్‌ చూసి.. పరుగులు తీసిన జనం

by Aamani |
డమ్మీ గన్‌ చూసి.. పరుగులు తీసిన జనం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివారులోని కాలనీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. దీంతో అతని వద్దనున్న గన్ కూడా కింద పడిపోయింది. గన్‌ను చూసిన స్థానికులు భయాంతో పరుగులు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, అది డమ్మీ గన్ అని చెప్పడంతో అంత ఊపిరి తీసుకున్నారు. అనంతరం అతనికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది.

Advertisement

Next Story