- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సీఎం పర్యటనలో ప్రజలు చావు డప్పులు మోగిస్తారు: డీకే అరుణ
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆయా జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే పర్యటన సందర్భంగా ప్రజలు చావు డప్పులు మోగించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా చావు డబ్బులు కొట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపును ఇవ్వడం పట్ల అరుణ తీవ్రంగా స్పందించారు. వడ్లు కొంటామని ఒకసారి, కొనం అని ఇంకోసారి చెబుతూ రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన చేతగానితనం తో బీజేపీ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఎక్కడివక్కడే వడ్లు ఉండి పోతున్నాయని, అమ్మకాలు జరగక పలుచోట్ల రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలను మరోసారి మోసం చేయాలని, బీజేపీ పై బురద చల్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే కుట్రలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని డీకే అరుణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాలలో పర్యటించే సందర్భాలలో ప్రజలె కేసీఆర్కు చావు డబ్బులను మ్రోగించి తగిన బుద్ధి చెబుతారని అరుణ హెచ్చరించారు.