- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మరణ మృదంగం.. శ్మశానానికి కూడా క్యూ కట్టిన జనం
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కోరలు చాచింది… ఆసుపత్రుల్లో బెడ్లు నిండుతున్నాయి… మార్చురీలో శవాలు పేరుకుపోతున్నాయి… శ్మశానాలు శవాలతో నిండుతున్నాయి… శ్మశానాల ఎదుట కరోనా మృతుల అంతిమ సంస్కారాల కోసం మృతుల బంధువులు ఎదురుచూస్తున్న దృశ్యాలు హృదయాలను కలిచి వేస్తున్నాయి. తాజాగా ఇలాంటి మనసు కలిచివేసే దృశ్యాలు ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో కనిపించాయి.
https://twitter.com/Spidey_e/status/1383337809071595525
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తుంది. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. హండన్ శ్మశాన వాటిక ముందు భారీ సంఖ్యలో మృతదేహాలు పడిఉన్నాయి. అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ కరోనా వలన ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్మశాన వాటికలో ఒకసారి ఐదు మృతదేహాలను మాత్రమే అనుమంతించాలని ఆంక్ష విధించడంతో.. శ్మశాన వాటిక వద్ద మృతుల బంధువులు ఇదిగో ఇలా క్యూ లో నిలబడ్డారు. సొంతవారి మృతదేహంతో.. తమ వంతు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ నిలబడ్డారు. హృదయ విదారకమైన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.