ప్రజలెవరూ అధైర్య పడొద్దు: కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

by Shyam |
ప్రజలెవరూ అధైర్య పడొద్దు: కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి
X

దిశ, న‌ల్ల‌గొండ‌: కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ అధైర్య పడొద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భగత్ సింగ్ నగర్, నాగారం మండలం వర్ధమానుకోట గ్రామాలను త‌మ‌ ఆధీనంలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. సోమవారం స్థానిక భగత్ సింగ్ నగర్ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఈ రెండు ప్రాంతాల్లో అన్ని రహదారులు మూసివేశామన్నారు. కావున ప్రజలందరూ ఈ రెండు ప్రాంతాల ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికీ నిత్యావసర వస్తువులు అందజేస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. బయట వ్యక్తులెవరినీ ఈ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని డీఎస్పీ నాగేశ్వర రావును కలెక్టర్ ఆదేశించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే చేపడుతున్నట్టు, అలాగే హైడ్రో క్లోరిన్ పిచికారి చేస్తున్నట్టు చెప్పారు. ఈ రోజు మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో వర్దమానుకోటకు చెందిన 6 గురు కుటుంబ సభ్యులకు, అలాగే భగత్ సింగ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి, బయట మరో వ్యక్తికి పాజిటివ్ నిర్దారణ అయిందన్నారు. మొత్తంగా 8 కేసులు పాజిటివ్ అని తేలిందన్నారు. ఈ ప్రాంత ప్రజలు మౌలిక వసతుల కోసం కమిషనర్, సంబంధిత అధికారులకు కాల్ చేసి విన్నవించుకోవాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరూ భయపడొద్దన్నారు.సమావేశంలో అర్డీఓఎస్ మోహన్ రావు, డీఎస్పీ నాగేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags: corona, lockdown, collector T.vinay krishna reddy, people no fear

Advertisement

Next Story