మరో 20 రోజులు లాక్‌డౌన్ తప్పనిసరి

by Shyam |   ( Updated:2020-04-12 05:51:44.0  )
మరో 20 రోజులు లాక్‌డౌన్ తప్పనిసరి
X

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రజలందరూ మరో 20 రోజులు లాక్ డౌన్ తప్పక పాటించాలని, అప్పుడే కరోనా వైరస్ బారి నుంచి బయట పడగలుగుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్, మెట్టుగడ్డ, సుదర్శన్ ఫంక్షన్ హాల్, మున్సిపాలిటీ, క్రిస్టియన్ పల్లి తదితర ప్రాంతాల్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు నిర్బంధం కొనసాగుతుందని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 9 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో 5 కంటైన్ మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశామన్నారు. అందరికీ రేషన్ బియ్యంతో సహా నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమయ్యే కూరగాయలు, పండ్లు, పాలు, నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన డాక్టర్ అనసూయ రెడ్డి రూ.50 వేల చెక్కును కరోనా సహాయార్థం మంత్రికి అందజేశారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

tags: corona, people follow another 20 days lockdown must, to overcome corona outbreak, minister srinivas goud

Advertisement

Next Story

Most Viewed