- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ జయంతిని ఇంట్లోనే జరుపుకోవాలి
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని, బయటకు రావొద్దని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు నగదు రూపకంగా లేదా చెక్కు రూపకంగా విరాళాన్నిజిల్లా అధికారులకు అందించాలన్నారు. ప్రతిరోజు ప్రజలు, వ్యాపారవేత్తలు, యువజన సంఘాలు, పెద్దలు కొంతమంది వలస కూలీలకు, అనాథలకు భోజనాలు, పండ్లను అందజేసేందకు ముందుకు రావాలని ఏసీపీ పిలుపునిచ్చారు. వారంతట వారు స్వయంగా బయటకు వెళ్లి సాయం చేయరాదని, అందుకోసం రెవెన్యూ అధికారులు లేదా పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగదు లేదా చెక్కు రూపంలో అందజేయాలని కోరారు. వచ్చిన డబ్బుతో పేదల అవసరానికి అనుగుణంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు.కరోనా వ్యాధి నియంత్రణకు ప్రజలందరూ పోలీసులకు, ప్రభుత్వానికి సహకరించాలని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు.
tags: corona, lockdown, ambedkar jayanthi, don’t come out side, do home only, acp rameshwar