- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజువారీ కూలీల జీవనం దుర్భరం
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో రోజువారీ కూలీలు, కులవృత్తిదారుల (రజక, నేత కార్మికుల) జీవనం దుర్భరంగా మారింది. మార్చి23వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ‘ఉపాధి’ లేక వీరు ఆపోసాపాలు పడుతున్నారు. నెల గడవడంతో అటు రెంటు కట్టాలని షాపుల యజమానుల నుంచి ఒత్తిడితో, ఇటు కుటుంబ పోషణకు ఎలా డబ్బు సమకూర్చుకోవాలో తెలియక ఆగమాగమవుతున్నారు. 44 రోజులుగా అనేక ఇబ్బందుల మధ్య కాలం వెలదీస్తున్నామని ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడగించిన నేపథ్యంలో తమ పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 7 లక్షల మంది..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజువారీగా హోటళ్లు, మెకానిక్ షెడ్లు, అటో కార్మికులతో పాటు దినసరి కూలీలు మొత్తం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కూలీలు సుమారు 7లక్షల వరకు ఉంటారు. ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షకు పైగా కుటుంబాలు క్షౌర వృత్తిపై ఆధారపడ్డవారున్నారు. సుమారు 25వేల క్షౌర దుకాణాలు ఉండగా ప్రతి దుకాణంలో ఇద్దరి నుంచి నలుగురు ఉపాధి పొందుతున్నాయి. రోజూ షాపునకు వెళ్తేనే వచ్చే కూలీ డబ్బులు ప్రస్తుతం అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1లక్ష82వేల రజక కుటుంబాలు ఉండగా జిల్లా వ్యాప్తంగా సుమారు 15,500 లాండ్రీ షాపులు ఉన్నట్లు సమాచారం. వీరు ఇప్పుడు అటు నెల గడవడంతో షాపుల అద్దె చెల్లించక, ఇటు తమ కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. షాపుల యజమానుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందుల్లో నేతన్నలు..
లాక్ డౌన్‌తో నేత కార్మికులూ కష్టాలపాలయ్యారు. ఇప్పటికే నేసిన చీరలను బయటకు పంపలేని పరిస్థితి నెలకోవడంతో తమకు డబ్బులు వచ్చే మార్గం లేకుండా పోయిందనీ, ముడి సరుకులూ అందుబాటులో లేక మగ్గం పనులు కూడా పూర్తిగా నిలిచిపోయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో పాటు షాపులూ మూతపడటంతో నేసిన చీరలు అలాగే ఉన్నాయి. దీంతో తమకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయని నేతన్నలు చెబుతున్నారు. వీరితో పాటు రోజువారీగా పనులు చేసుకునే లక్షల మంది నేడు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం అరకొరగానే ఉండటం, అది కూడా అందరికీ అందకపోవడంతో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మొత్తం మీద లాక్ డౌన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 9లక్షల కుటుంబాలు అనేక అవస్థల మధ్య గడుపుతున్నాయి.
Tags: difficulties, of people, coronavirus, covid 19, prevention, lockdown, daily labour