- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందని ద్రాక్షలా డబుల్ బెడ్రూమ్ లు.. ఇంకా పూర్తికాని నిర్మాణాలు..
దిశ, దుమ్ముగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్దిదారులకు అందని ద్రాక్షలా మారాయి. దుమ్ముగూడెం మండలంలో దాదాపు ఎనిమిది పంచాయితీలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రతిపాదం చేసారు. అయితే వాటిలో రెండు పంచాయితీలలో ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఇండ్లను లబ్దిదారులకు కేటాయించారు. అయితే మిగిలిన చోట్లకూడా ఈ నిర్మాణ పనులు మొదలుపెట్టి దాదాపు ౩ సంవత్సరాలు పూర్తిగావోస్తున్నా, ఇంత వరకు పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదని ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు అంటున్నారు.
ఇదిలా ఉంటె ఒకవైపు నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరిగేల చూడాల్సిన అధికారులులే నిమ్మకు నీరేతినట్లు వ్యవహరిస్తున్నారని నిర్మాణ పనులు పట్టించుకోవడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఈ విషమై లబ్దిదారులు మరియు ప్రజా ప్రతినిధులు కలిసి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికి వారు పట్టించుకోపోవడం ఘమనార్హం. డబుల్ బెడ్రూమ్ ఇల్ల నిర్మాణాలు పూర్తికాక, నిర్మాణ ప్రదేశాలలో పిచ్చిచెట్లు పెరిగి అడవులను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, కాంట్రాక్టర్లు కళ్ళు తెరచి, ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి అందజేయాలని లబ్దిదారులు కోరుతున్నారు.