సెక్స్‌ గురించి మాట్లాడేందుకు గట్స్ ఎందుకు..? : కరీనా

by Shyam |
kareena kapoor
X

దిశ, సినిమా : గట్స్ లేకపోతే గ్లోరీ కూడా దక్కదని.. బాలీవుడ్ యాక్ట్రెస్ కరీనా కపూర్ ఎప్పుడూ చెబుతుటోంది. కానీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో కోల్పోయిన తన సెక్స్ లైఫ్‌ గురించి మాట్లాడేటప్పుడు ఈ మాటలను వెనక్కి తీసుకుంది. రోజువారీ జీవితంలో భాగమైన సెక్స్ గురించి మాట్లాడేందుకు ధైర్యం అవసరం లేదని చెప్పింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్‌లో.. తను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పటి విషయాలతో పాటు బ్రెస్ట్ ఫీడింగ్ తదితర అంశాలను వెల్లడించిన బెబో.. తాజా ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలను చర్చించింది. మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ సెక్స్ అంశాలపై, ప్రత్యేకించి ప్రెగ్నెన్సీ సమయంలో అనుభవాల గురించి మాట్లాడితే ప్రేక్షకులకు నచ్చదని అభిప్రాయపడింది.

ఈ టాపిక్‌పై మాట్లాడేందుకు ధైర్యం అవసరమని తాను అనుకోడం లేదన్న కరీనా.. సెక్స్ అనేది భార్యాభర్తలకు సంబంధించినదని, ఇది ఒక మహిళ ఎలా ఫీల్ అవుతుందనే దాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది. ‘ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎవరైనా మహిళ శృంగారానికి దూరంగా ఉండాలని అనుకోకపోవచ్చు, తనకు సెక్స్ ఫీలింగ్స్ కలగకపోవచ్చు లేదంటే తనను తాను ఇష్టపడుతున్నట్లు కూడా భావించకపోవచ్చు’ అని చెప్పింది. ప్రసవానికి ముందు చాలామంది మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed