అధికారుల అండదండలతో.. దర్జాగా బోర్ల దందా

by Sridhar Babu |   ( Updated:2021-12-19 22:32:35.0  )
అధికారుల అండదండలతో.. దర్జాగా బోర్ల దందా
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలో అర్ధరాత్రి జోరుగా బోరు వేస్తున్నారని స్థానిక ప్రజలు అన్నారు. ఆదివారం అర్థరాత్రి ఇళ్ల మధ్యలో బోరు వేస్తుండటంతో చుట్టూ ఉన్న ప్రజలు బోరు యజమాని పై తిరగపడ్డారు. వ్యవసాయానికి ఉపయోగించే బోర్లు ఇళ్ల మధ్యలో వేస్తే మా ఇండ్లకు నీరు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అలాగే బోరు వేయించుకుంటున్న ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీకు బోరు వేసుకోమని ఎవరు పర్మిషన్ ఇచ్చారని ప్రజలు ఇంటి యజమానిని నిలదీయగా.. స్థానిక ఎమ్మార్వో పర్మిషన్ ఇచ్చారని తెలిపాడు.

దీనితో ఆగ్రహించిన ప్రజలు వెంటనే బోరు బండిపై తిరగపడి బోరును ఆపేశారు. ఏది ఏమైనా సరే బోరు వేయడానికి వీలు లేదని బిస్మించుకు కూర్చున్నారు. దీనితో బోరు యాజమని చేసేది ఏమి లేక బోరు వాహనాన్ని వెనుకకు తీసుకువెళ్లాడు. ఇప్పటికైనా అధికారులు బోరు వాహనాలపై చర్యలు చేపట్టి మండలంలో ఇళ్ల మధ్యలో బోర్లు వేయకుండా చూడాలని ప్రజలు కోరారు. అలాగే అర్ధరాత్రులు బోర్లు వేస్తే సహించేదిలేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

మితిమీరి బోర్లు వేస్తున్న బోర్ల యజమాని వెంకటేశ్వర్లు..

మండలంలో అర్దరాత్రులు మితిమీరిన బోర్లు వేస్తున్నడని బోర్ల యజమాని వెంకటేశ్వర్లుపై మండల ప్రజలు మండిపడ్డారు. నెలలో కనీసం ఒకటి, రెండు బోర్లు వేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నడని ప్రజలు అంటున్నారు. ఏజెన్సీ ఏరియా ప్రాంతంలో బోరుకి పర్మిషన్ లేకపోయిన బోరు యజమాని వెంకటేశ్వర్లు అధికారులను మచ్చిక చేసుకొని జోరుగా బోర్ల దందా చేస్తున్నాడని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మండలంలో బోర్లు వేయకుండా చూడాలని, బోర్లు వేస్తే వెంటనే బోరు వాహనాన్ని సీజ్ చేయాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, పలువురు మేధావులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed