అందుబాటులోకి పెన్ శానిటైజర్..

by Shamantha N |
అందుబాటులోకి పెన్ శానిటైజర్..
X

దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి శానిటైజర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో పలు కంపెనీలు వివిధ రకాల శానిటైజర్లను తయారుచేసి, మార్కెట్లో అందుబాటులోకి తెచ్చాయి.ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. పెన్‌ శానిటైజర్‌ను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ పెన్‌ రాయడానికే గాక చేతులను శానిటైజ్‌ చేసుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది.

కరోనా రాకముందు ఎవరూ శానిటైజర్లు వాడేవారు కాదు. కానీ, ఇప్పుడది అత్యవసర వస్తువైపోయింది. ఒక్కొక్కరూ ఒక్కోరకం శానిటైజర్‌ను ఇష్టపడుతారు. వారి అవసరాలకనుగుణంగా తాము వినూత్నంగా శానిటైజర్‌ పెన్‌ను రూపొందించాం. దీనిని విద్యార్థులు స్కూల్‌కు, ఉద్యోగస్తులు ఆఫీస్‌కు పాకెట్‌లో పెట్టుకుని వెళ్లొచ్చు. దీనిని రాయడానికి, చేతులను శానిటైజ్‌ చేసుకునేందుకు ఉపయోగించవచ్చు.’ అని మెడిషీల్డ్‌ హెల్త్‌కేర్‌ ఎండీ డాక్టర్‌ ఫరాజ్‌ హసన్‌ తెలిపారు. అదేవిధంగా, మరోరకం శానిటైజర్‌ను తయారుచేశామని, ఇది రాయదు గానీ, చేతులను శానిటైజ్‌ చేస్తుందని.. మూడు గంటల వరకు ప్రభావం చూపిస్తుందని తెలిపారు.

Advertisement

Next Story