- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పెళ్లి బంధం కన్నా ఎఫైర్స్ బెటర్?’
దిశ, సినిమా : ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అనేది పెద్దల మాట. కానీ ఓ ఏజ్ వచ్చాక అదే పెద్ద తంటా అంటున్నారు మిలీనియల్స్. ఇప్పుడు ఏ రిలేషన్‌లోనైనా ‘ఓన్ ఐడెంటిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్’తో పాటు ‘ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్’కే ఇంపార్టెన్స్. పార్టనర్ అయినా సరే.. పార్ట్ ఆఫ్ లైఫ్! అంతే. ఈ ఫార్ములాను సరిగ్గా ఫాలో అయ్యేవాడే రాంగోపాల్ వర్మ. భిన్న మసస్తత్వాలున్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకేగదిలో నివసించడమే అసలు సమస్య అనేది వర్మ సిద్దాంతం. పెళ్లికి ముందు కనిపించిన ప్రేమలేవీ.. ఆ తర్వాత ఉండవని, పెళ్లి బంధం కన్నా ఎఫైర్స్ బెటర్? అనేది అతని ఫిలాసఫీ. పెళ్లైన మూడో రోజుకే ఈ విషయాలపై తనకు క్లారిటీ వచ్చిందన్న వర్మ.. తన వైఫ్‌తో విడిపోయేందుకు దారితీసిన ఒక్కో కారణంతో పాటు తన ఏంజెల్ శ్రీదేవి పరోక్ష పాత్రను, తన ఫ్రెండ్స్‌కు ఎదురైన ఇన్సిడెంట్స్‌ను స్పార్క్ ఓటీటీ ‘పెళ్లి పెటాకులు’ ఎపిసోడ్ ద్వారా పూసగుచ్చినట్టు వివరించారు. ఈ మేరకు పెళ్లిచేసుకోబోయే ముందు ఒక్కసారి ఆలోచించండని యంగ్ జనరేషన్‌కు హితబోధ చేశారు.
పెళ్లికి ముందు ఎన్ని సంవత్సరాలు కలిసి తిరిగినా, ప్రతీరోజు కొత్తగానే ఉంటుందన్న వర్మ.. మ్యారేజ్ అయ్యాక ఆ స్పార్క్ తగ్గిపోతుందని చెప్పాడు. పర్సనల్ లైఫ్ కోల్పోవడంతో పాటు ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడమే ఇక్కడ ప్రధాన సమస్య అని తెలిపాడు. అప్పటిదాకా తమ ఇష్టాయిష్టాలను గౌరవించుకున్నవారు, ఆ తర్వాత పార్టనర్‌లో నచ్చని విషయాలనే పాయింట్ అవుట్ చేస్తారన్నాడు.
తన డైవోర్స్ విషయంలో శ్రీదేవి పాత్ర..
ఆర్జీవీకి వివాహమైన మూడోరోజు నుంచే భార్యతో అభిప్రాయ భేదాలు మొదలైనట్టు తెలిపాడు. హీరోయిన్ శ్రీదేవి ఎపిసోడ్ వాటికి మరింత బలం చేకూర్చిందని ఆ ఇన్సిడెంట్ గుర్తుచేసుకున్నాడు. ‘క్షణం క్షణం’ మూవీ షూటింగ్ డేస్‌లో వర్మతో మాట్లాడేందుకు శ్రీదేవి ఇంటికి ఫోన్ చేసిందట. ఆ టైమ్‌లో వర్మ ఇంట్లో లేకపోతే ఆయన వైఫ్ మాట్లాడిందట. వర్మ ఇంటికి వచ్చాక మీ ఏంజెల్ ఫోన్ చేసిందని, ఇంత లేట్ నైట్ ఎందుకు చేసిందని ప్రశ్నించిందట. ఓ వైపు ఆమె పశ్నకు చిరాకుపడుతూనే.. శ్రీదేవితో ఎఫైర్ ఉందని అనుకోవడాన్ని ఎంజాయ్ చేశాడట. రానురాను ఇలాంటి డామినెన్స్ ఎక్కువ కావడం, వైఫ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగినట్టుగా ఉండకపోవడంతో ఎవరిదారి వారు చూసుకున్నామని చెప్పుకొచ్చాడు వర్మ.
ప్రేమ.. పెళ్లితోనే కొలాప్స్!
ప్రేమలో ఉన్నవాళ్లు ఎవరైనా.. ‘నేను తన మనసును ప్రేమిస్తున్నా.. శరీరాన్ని కాదు, తనపై సెక్సువల్‌గా ఎలాంటి కోరికల్లేవు’ అని చెబుతుంటారు. ఈ విషయంపై స్పందించిన వర్మ.. అదంతా ఒట్టి ట్రాష్ అని కొట్టిపారేశాడు. ప్రేమ వెనకాల దాగున్నది కామమే అని స్పష్టం చేశాడు. ఎవరు కూడా ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని బయటపెట్టరని, ప్రేమలో ఏం చేసినా అడ్జస్ట్ అవుతారన్నాడు. కానీ పెళ్లయ్యాక కంటిన్యుయస్‌గా ఒకే చోట ఉండాల్సి వచ్చినపుడు అన్నీ బయటపడతాయన్నాడు. ఈ క్రమంలో పెంచుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను పార్టనర్ తీర్చలేకపోతే ఫ్రస్టేషన్ పెరిగిపోతుందన్నాడు. చివరకు అది విడాకులకు దారితీస్తుందని చెప్పాడు. ఇక వైవాహిక జీవితంపై విరక్తి చెందిన చాలామంది ఎక్స్‌ట్రా మారిటల్ ఎఫైర్స్‌కు అట్రాక్ట్ కావడంపై క్లారిటీ ఇచ్చాడు. ఒక్కరిద్దరితో ఎఫైర్ ఉన్నా సమస్యేనని, అది గొడవలకు కారణమవుతుందన్న వర్మ.. అదే నలుగురు ఐదుగురితో రిలేషన్‌లో ఉంటే మన క్యారెక్టర్‌పై ఎవరూ ఫోకస్ చేయరన్నారు. అది అడ్వాంటేజ్‌గా మారుతుందన్నారు. అందుకే తను అదే ఫార్ములా ఫాలో అవుతానని చెప్పాడు.
సంజయ్ దత్ జైలు కహానీ..
పెళ్లి విషయంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లవ్ స్టోరీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పిన వర్మ.. బాంబ్ బ్లాస్ట్ కేసులో జైలులో ఉన్నప్పుడు తన లాయర్ రియాతో ప్రేమలో పడ్డట్టు తెలిపాడు. రియా.. సంజయ్‌ను ములాఖత్‌లో కలిసినప్పుడు ఇద్దరూ చేతివేళ్లను టచ్ చేసుకునే ఒకరినొకరు ప్రేమించుకునేవారని చెప్పాడు. సంజయ్ జైలు నుంచి వచ్చిన వెంటనే తనని పెళ్లి చేసుకున్నాడని, కానీ ఆర్నెళ్లు తిరిగేసరికి ఆ ప్రేమ మాయమైందన్నాడు. రియా నుంచి దూరంగా ఉండేదుకు సంజయ్ మళ్లీ జైలుకైనా వెళ్తానన్నాడని.. అంటే దూరంగా ఉంటే మనలోని నెగెటివిటీ తెలియదని, దగ్గరైతే అన్నీ ఓపెన్ అయిపోతాయని అప్పుడు ఇష్టం తగ్గిపోతుందని తెలిపాడు.