- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నలుగురు నేరస్థులపై పీడీయాక్ట్
దిశ, క్రైమ్‌బ్యూరో: దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నేరస్థులపై సైబరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి శాంతినగర్‌లో నివసించే ఉప్తాల ఆనంద్, జర్పాటి యాదయ్య, చిన్న యాదయ్యలు తాళాలు వేసిన ఇళ్లను బ్రేక్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిపై చందానగర్ పీఎస్‌లో 2019సెప్టెంబర్ నుంచి 2020 ఫిబ్రవరి వరకూ వరుసగా 5కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మహారాష్ట్ర నాసిక్ చెందిన ప్రకాష్ షిండే మారు పేరుతో గుర్తింపు కార్డులను సృష్టించుకుని రైలు ప్రయాణంతో తరచుగా నాసిక్ వెళ్ళి అక్కడ దొంగతనాలు చేసి మరుసటి రోజే తిరిగి వచ్చేవాడు. శంషాబాద్, కొత్తూర్, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లతో పాటు షిండేపై ఇతర రాష్ట్రాల్లో మొత్తం 28కేసులు నమోదయ్యాయి. దీంతో చందానగర్ కు చెందిన ముగ్గురు నేరస్థులతో పాటు ప్రకాశ్ షిండేపై సైబరాబాద్ కమినర్ వీసీ సజ్జనార్ బుధవారం పీడీ యాక్ట్ బుక్ చేశారు.