సీఎం కేసీఆర్ ఆదేశాలు.. వారికోసం డ్రోన్లతో హంటింగ్

by Sridhar Babu |
సీఎం కేసీఆర్ ఆదేశాలు.. వారికోసం డ్రోన్లతో హంటింగ్
X

దిశ, పెద్దపల్లి : రాష్ట్రంలో గంజాయి సరఫరాను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. యువతను మత్తులో ముంచి చిత్తు చేస్తున్న గంజాయి నియంత్రణకు పెద్దపల్లి పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు. సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి పోలీసులు గంజాయి సరఫరా నియంత్రణకు దృష్టి సారించారు. శనివారం పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో గంజాయి ఎక్కువగా వాడకంలో ఉన్న ప్రాంతాలను గుర్తించారు. గంజాయి సరఫరా చేసే వ్యక్తులతో పాటు వినియోగిస్తున్న వారిని పట్టుకు నేందుకు డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు.

జిల్లా కేంద్రంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో గంజాయి వినియోగిస్తున్న వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో గంజాయి నియంత్రణకు పూర్తిగా చర్యలు ప్రారంభించామన్నారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలపై కూడా నిఘా పెంచామన్నారు. ఇప్పటికే వారిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేశామని, తీరు మారకపోతే పీడీ యాక్ట్ పెట్టేందుకు వెనకాడమన్నారు.ఈ తనిఖీల్లో ఎస్ఐలు రాజేష్, రాజ వర్ధన్, సహదేవ్ సింగ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story